గంగవరం:8 సెప్టెంబరు 2020(రెడ్ బీ న్యూస్): గర్భిణీ స్త్రీలు, బాలింతలు చక్కటి పౌష్టికాహారం తీసుకోవడం ద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చని మండల పరిషత్ అభివృద్ధి అధికారి జాన్ మిల్టన్ అన్నారు. ఐసీడీఎస్ సీడీపీవో నీలవేణి ఆధ్వర్యంలో వైయస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ కిట్లను గర్భిణీలకు మంగళవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీడీవో మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో మాతా శిశు మరణాలు అరికట్టేందుకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని, దీనిలో భాగంగానే ప్రత్యేక పోషకాహారాన్ని అందిస్తుందన్నారు. ఈ కిట్స్ ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. సీడీపీవో నీల వేణి మాట్లాడుతూ ఏజెన్సీలో చాలామంది మహిళలు రక్తహీనత కారణంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్నాయని వీటిని అరికట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వైయస్ఆర్ సంపూర్ణ పోషణ పథకాన్ని చేపట్టిందన్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకులు బేబీ పావని, గంగాదేవి, అడ్డతీగల, దేవీపట్నం, రంపచోడవరం, రాజవొమ్మంగి సీడీపీవో వరహాలు, క్రాంతి, రత్నకుమారి, మాధవి అంగన్వాడి వర్కర్స్ పాల్గొన్నారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







