UPDATED 15th AUGUST 2017 TUESDAY 2:00 PM
పెద్దాపురం: స్థానిక శ్రీ ప్రకాష్ సినర్జీ స్కూల్లో 71 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా అంతర్జాతీయ ప్రకృతి వైపరీత్య పరిరక్షణ అధికారి విజయకుమార్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు మంచి క్రమశిక్షణతో నడుచుకోవాలని తద్వారా దేశానికి మంచి పేరు ప్రతిష్ఠలు తీసుకొచ్చిన వారవుతారన్నారు. అలాగే దేశం ఎన్నో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కొంటోందని వాటిని పరిరక్షించడం మన బాధ్యతని ఆయన పేర్కొన్నారు. అనంతరం పాఠశాల డైరెక్టర్ సి.హెచ్. విజయ్ ప్రకాష్ మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ స్వతంత్రంగా ఆలోచించి చక్కని విలువలు పాటించాలని సూచించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.







