గెలుపే లక్ష్యంగా సమన్వయంతో పనిచేయాలి

UPDATED 20th AUGUST 2017 SUNDAY 10:00 PM

కాకినాడ: అభ్యర్థుల గెలుపే ప్రధాన లక్ష్యంగా ఎన్నికల కమిటీలు పనిచేయాలని  రాష్ట్ర ఆర్థిక శాఖా  మంత్రి యనమల రామకృష్ణుడు సూచించారు. స్థానిక టిడిపి జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన క్లస్టర్‌ స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు సమయం తక్కువగా ఉండడం వల్ల అన్ని డివిజన్లలో పోటీలో ఉన్న అభ్యర్థుల విజయం కోసం పనిచేయాలని, ఎన్ని ఇబ్బందులు ఉన్నా పార్టీ తరఫున పోటీలో ఉన్న వారిని గెలిపించే బాధ్యత మీపై ఉందని ఆయన స్పష్టం చేశారు. గత మూడేళ్లలో కాకినాడ నగరంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను తిప్పికొడుతూ రూపొందించిన ‘ఇదిగో అభివృద్ధికి రుజువు’ ప్రచార పత్రాన్ని మంత్రులు ఆవిష్కరించారు. గడచిన మూడేళ్లలో నగరంలో చేసిన అభివృద్ధి వివరాలను వివరిస్తూ ఆయా వార్డుల్లో ఈ పత్రాలను పంపిణీ చేసేందుకు వీటిని రూపొందించారు. ఈ సమావేశంలో రాష్ట్ర  ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి  నిమ్మకాయల చినరాజప్ప, పౌరసరఫరాల శాఖా మంత్రి  ప్రత్తిపాటి పుల్లారావు, ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, దాట్ల సుబ్బరాజు, గొల్లపల్లి సూర్యారావు, వనమాడి వెంకటేశ్వరరావు, పిల్లి అనంతలక్ష్మి, పార్టీ జిల్లా అధ్యక్షుడు నామన రాంబాబు తదితరులు పాల్గొన్నారు.

 

 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us