UPDATED 5th NOVEMBER 2020 THURSDAY 8:00 PM
కాకినాడ (రెడ్ బీ న్యూస్): ఆరోగ్యశ్రీ కి సంబంధించిన సమగ్ర సమాచారం తెలియబరిచే బుక్ లెట్ ను స్థానిక కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ డి. మురళీధర్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. నెట్ వర్క్ హాస్పిటల్స్, అక్కడ అందుబాటులో ఉన్న వైద్య సేవలతో పాటు ఫోన్ నంబర్స్ కూడా అందులో పూర్తిగా ఇచ్చినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి, ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ రాధాకృష్ణ, జిల్లా మేనేజర్ రాంబాబు పాల్గొన్నారు.







