చర్చిని తొలగించాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు

UPDATED 15th APRIL 2018 SUNDAY 9:00 PM

సామర్లకోట: పట్టణ పరిధిలోని స్థానిక అయోధ్యరామపురంలో హిందువుల మనోభావాలను కించపరుస్తూ ఇళ్ల మధ్య చర్చి నిర్వహిస్తున్న పాస్టర్, తదితరులపై పోలీస్ స్టేషన్లో స్థానికులు ఫిర్యాదు చేశారు. హిందువులు నివాసం ఉంటున్న ప్రాంతంలో మైకులు ద్వారా హిందూ దేవతలను దూషిస్తూ, హిందువుల మనోభావాలను కించపరుస్తున్నారని, మహిళల పట్ల పాస్టర్లు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారని, మతం మార్చుకోవాలని లేకపోతే ఎస్.సి, ఎస్.టి. అట్రాసిటీ కేసు పెడతామని బెదిరిస్తున్నారని అన్నారు. ఈ విషయమై గతంలో తహసీల్దార్ కు ఫిర్యాదు చేయడంతో ప్రజలకు ఇష్టంలేని ప్రదేశంలో చర్చి నిర్వహణను తొలగిస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఆదివారం ప్రచారం చేయడంతో ఫిర్యాదు చేస్తున్నామని అన్నారు. దీనిపై ఎస్సై శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ ఇది సున్నితమైన సమస్యని, మతపరమైన విభేదాలు తలెత్తకుండా పరిష్కరించుకోవాలన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us