యువత భవిష్యత్ తీర్చిదిద్ధేందుకే జాబ్ మేళాలు

UPDATED 13th JULY 2018 FRIDAY 6:30 PM

పెద్దాపురం: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తును తీర్చిదిద్ధేందుకు రాష్ట్రవ్యాప్తంగా జాబ్ మేళాలు నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ చైర్మన్ రాజా సూరిబాబురాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక మహారాణి కళాశాలలో నిర్వహించిన జాబ్ మేళా కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్మన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో చైర్మన్ సూరిబాబురాజు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసిందని, అలాగే వారు ఇంటర్వ్యూలో విజయం సాధించడానికి తగిన శిక్షణ కూడా ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప నియోజకవర్గ అభివృద్ధితో పాటు నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి జాబ్ మేళాలు ఏర్పాటు చేస్తున్నారని, దూరప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయడం ఇబ్బందిగా ఉంటుందనే ఆలోచనలకు యువత స్వస్తి పలికి ఉద్యోగంలో చేరి అంచెలంచెలుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ ఎస్. ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ ఈ జాబ్ మేళాకు 19 కంపెనీలు వచ్చాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, జిల్లావ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వారా ఈ జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ జాబ్ మేళాలో 720 మంది అభ్యర్థులు హాజరుకాగా 257 మంది అభ్యర్థులు ఎంపికయ్యారు. ఎంపికైన అభ్యర్థులకు మున్సిపల్ చైర్మన్ ఉద్యోగ నియామక పత్రాలు అందచేశారు. ఈ కార్యక్రమంలో మహారాణి కళాశాల వైస్ ప్రిన్సిపాల్ పి.వి.చౌదరి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ హెచ్ఆర్ లలితాశ్రీ, ఉప ముఖ్యమంత్రి పిఎ నిమ్మకాయల  సుబ్బారావు, సతీష్, వివిధ కంపెనీల ప్రతినిధులు, అధిక సంఖ్యలో యువతీ, యువకులు పాల్గొన్నారు. 
 
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us