పంటకోత ప్రయోగాలపై శిక్షణ

UPDATED 3rd MARCH 2018 SATURDAY 9:00 PM

సామర్లకోట: తూర్పుగోదావరి జిల్లా సామర్లకోట మండలం పరిధిలోని 76 పంటకోత ప్రయోగాలను నిర్వహించనున్నట్లు ప్రధానమంత్రి ఫసల్ బీమా పథకం ఏఈవో శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శనివారం  నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సామర్లకోట మండల పరిధిలోని గ్రామాలలో ప్రతీ గ్రామంలో నాలుగు చొప్పున పంటకోత ప్రయోగాలను నిర్వహించేందుకు చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లో దిగుబడులను బట్టి  గడచిన కాలంలో దిగుబడులను అంచనా వేయడం జరుగుతుందని ఆయన  పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు, వ్యవసాయ శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us