ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో గెస్ట్ లెక్చర్

UPDATED 28th NOVEMBER 2018 WEDNESDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రాక్టికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అనే అంశంపై బుధవారం గెస్ట్ లెక్చర్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (హైదరాబాద్) అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ బి. వెంకటేశం హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రాక్టికల్ యాస్పెక్ట్స్ ఆఫ్ వైబ్రేషన్స్ అంశం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, డైరెక్టర్ ఆఫ్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరెక్టర్ డాక్టర్ జి. రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కె. సత్యనారాయణ, వివిధ విభాగాల అధిపతులు, కార్యక్రమ కోఆర్డినేటర్లు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ పి. కుమార్ బాబు, అసోసియేట్ ప్రొఫెసర్ జి. అవినాష్, తదితరులు పాల్గొన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us