రోగులకు మానవతా దృక్పథంతో సేవలందించాలి

UPDATED 5th FEBRUARY 2019 TUESDAY 6:00 PM

పెద్దాపురం: రోగులకు మానవతా దృక్పథంతో వైద్యాధికారులు, నర్సులు, సిబ్బంది సేవలు అందించాలని  ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. పెద్దాపురం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశం ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ బొడ్డు బంగారుబాబు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆసుపత్రి అభివృద్ధి కమిటీ వైస్ చైర్మన్, ఆర్డీవో వసంతరాయుడు  ఆసుపత్రి అభివృద్ధి పనులు, వివిధ సమస్యలపై చర్చించారు. ప్రభుత్వం త్వరలో ఆసుపత్రులకు వైద్యులను నియమించడం జరుగుతుందని, పెద్దాపురం ఆసుపత్రి పరిధిలో ఎక్కువగా ప్రమాదాల కేసులు నమోదు అవుతుండడంతో తప్పనిసరిగా ఆర్థో పెడిక్, గైనికాలజీ వైద్యులను నియమించాల్సిన అవసరం ఉందని అన్నారు. తల్లి సురక్ష పథకం, బ్లడ్ బ్యాంక్, అంబులెన్స్ ఏర్పాటు, కంప్యూటర్లు పనితీరు, ఆరోగ్యశ్రీ, ఫిల్టర్ వాటర్, టాయిలెట్స్, దోమతెరలు, చెప్పుల స్టాండ్, సింక్, మహాప్రస్థానం వాహనం తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. బెడ్స్ పెంచడం జరిగిందిగాని బడ్జెట్ పెంచలేదని, అలాగే ఆసుపత్రి ఎదురుగా ఉన్న రోడ్డుపై స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడానికి ఆర్ అండ్ బి అధికారుల దృష్టికి తీసుకురావాలని సమావేశంలో నిర్ణయించారు. అనంతరం ఆర్డీవో ఆసుపత్రి పరిసరాలు, పరిశుభ్రతను పరిశీలించి రోగులను కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరిండెంటెంట్ డాక్టర్ ఆర్. రవికాంత్, కమిటీ సభ్యులు బిక్కిన సాయినాధ్, రావులపర్తి విజయ్, జి. లక్ష్మి, హెడ్ నర్సు అమ్మాజీ, హెడ్ సిస్టర్ రత్నకుమారి, ఫార్మసిస్ట్ రాజేష్, డాక్టర్ సుదీప్తి, డాక్టర్ దీపిక, డాక్టర్ రాధ, నీరజ్ తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us