టీడీపీతోనే ప్రజారంజక పాలన

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు

పెద్దాపురం (రెడ్ బీ న్యూస్) 12 డిసెంబరు 2021: ప్రజారంజక పాలన టీడీపీతోనే సాధ్యమని మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. పట్టణంలో కొత్తపేటలో ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గౌరవ సభ కార్యక్రమంలో ఆయన ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించి మాట్లాడారు. వైసీపీ పాలనలో అభివృద్ధి తిరోగమనంలోకి వెళ్లిపోయిందన్నారు. అలాగే ఓటీఎస్‌ పేరుతో ప్రజల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన అభివృద్ధి తప్పితే వైసీపీ చేసింది ఏమీ లేదన్నారు. ఎమ్మెల్యే చినరాజప్ప మాట్లాడుతూ ఆర్థిక సంఘం నిధులను దారి మళ్లించడం పంచాయతీల్లో కనీసం పారిశుధ్య పనులు చేపట్టలేని స్థితిలో వైసీపీ ఉందన్నారు. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబును మళ్లీ సీఎంను చేసి శాసనసభకు పంపాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ రాజాసూరిబాబురాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాకినాడ రామారావు, రైతు సంఘం నాయకుడు పాలకుర్తి శ్రీనుబాబు, గుడా మాజీ డైరెక్టర్‌ ఎలిశెట్టి నాని, ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ మాజీ చైర్మన్‌ బొడ్డు బంగారుబాబు. కొరుపూరి రాజు, తూతిక రాజు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us