టాలీవుడ్ లో కుర్ర హీరోయిన్ల జోరు

UPDATED 16th JULY 2017 SUNDAY 8:00 PM

హీరోయిన్స్ విషయంలో టాలీవుడ్ లో ఓ కొత్త ధోరణి కనిపిస్తోంది. కొత్త నీరొచ్చి పాతనీటిని కొట్టేసినట్టు ఇప్పటి కుర్ర హీరోయిన్స్ ఇండస్ట్రీని దడదడ లాడించేస్తున్నారు. నిన్నటిదాకా ఫుల్ బిజీగా ఉన్న సీనియర్ హీరోయిన్స్ కాస్త వెనకబడ్డారు. ఏడాదికి ఒకటి రెండు సినిమాలకంటే ఎక్కువ చేయడం లేదు. కొందరికైతే అసలు సినిమాలే లేకుండా పోయాయి. ఈ టైంలో యంగెస్ట్ హీరోయిన్స్ సందడి చేస్తున్నారు. వారి హవా నడుస్తోంది. ఇన్ ఫాక్ట్ ..సీనియర్స్ కంటే యంగ్ హీరోయిన్స్ రెపరెపలు ఆడియన్స్ ను ఆకట్టుకొంటున్నాయి. యంగ్ హీరోయిన్స్ కు ఎందుకింత డిమాండ్ అనే క్వశ్చన్ కు ఆన్సరుంది. హీరోల్లో కూడా యువ హీరోలు ఎక్కువ మంది వస్తున్నారు. హిట్లిస్తున్నారు. వారి సరసన నటించేందుకు సీనియర్ హీరోయిన్స్ వయసు ఎక్కువగా కనిపిస్తుంది. కాబట్టి యంగ్ హీరోయిన్స్ అవసరం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. సమంత, నయనతార, కాజల్, తమన్నా వంటి సీనియర్లు సీనియర్ హీరోలు, యంగ్ హీరోలతో కూడా నటిస్తున్నారు. కానీ సీనియర్ హీరోలు తమ రేంజ్ హీరోయిన్స్ నే సెలెక్ట్ చేసుకుంటున్నారు. నిన్నటివరకు మెరుపులు మెరిపించిన తాప్సీ, హన్సిక, ఇలియానా ఇప్పుడు టాలీవుడ్ లో కనబడడం లేదు. వారి ప్లేస్ లో హెబ్బా పటేల్, రాశిఖన్నా, రకుల్ ప్రీత్ సింగ్, అనూ ఇమాన్యుయేల్, లావణ్య త్రిపాఠీ, రెజీనా, కీర్తి సురేష్, మెహ్రీన్ వంటి మోస్ట్ యంగ్ హీరోయిన్స్ వచ్చేశారు. వీరిలో హెబ్బా పటేల్, రకుల్, మెహ్రీన్ లాంటి వారికైతే మూవీ ఆఫర్లు విపరీతంగా వస్తున్నాయి. ఒక్కొక్కరు ఏడాదికి ఏకంగా మూడు, నాలుగు సినిమాల్లో చేస్తున్నారు. యంగ్ హీరోయిన్స్ కు టాలీవుడ్ రెడ్ కార్పెట్ పరిచింది. ఈ ముద్దు గుమ్మలు కూడా తమ గ్లామర్ తో అదరగొడుతున్నారు. వారికి ఛాన్సుల మీద ఛాన్సులు వచ్చిపడుతున్నాయి. మరి వీరి హవా ఎంతకాలం ఉంటుందో చూడాలి.
ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us