ఆదిత్య గ్లోబల్ స్కూల్ ఆదిత్ 2కె19కు ఏర్పాట్లు పూర్తి

UPDATED 12th SEPTEMBER 2019 THURSDAY 9:00 PM

గండేపల్లి(రెడ్ బీ న్యూస్) : గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య విద్యా సంస్థల ప్రాంగణంలో ఆదిత్ 2కె19 ఈనెల 13,14 తేదీల్లో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆదిత్య బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేఖరుల సమావేశంలో డాక్టర్ సుగుణారెడ్డి మాట్లాడుతూ మేనేజ్ మెంట్ విద్యార్థులలో నిబిడీకృతమైన  నైపుణ్యాన్ని వెలుగుచూపేందుకు ఆదిత్య ఆదిత్ ద్వారా వివిధ రకాల అంశాలలో పోటీలు నిర్వహించి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులతో వారిని ప్రోత్సహించడం జరుగుతుందని, ఇందులో మార్కెటింగ్, ఫైనాన్స్, మానవ వనరులు, ఐటి రంగాలలో పోటీలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ జాతీయస్థాయి ఈవెంట్ కు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామని, వివిధ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ప్రత్యక్షంగా, ఆన్ లైన్ ద్వారా తమ పేర్లు రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపారు. విద్యార్థిలోని సృజనాత్మక భావాలను పరస్పరం పంచుకొని మరింత జ్ఞానం పెంపొందించుకునేందుకు ఆదిత్ ఒక వేదికగా నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులచే వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ఉత్సాహంగా సాగుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంపై అవగాహనకు ప్లాష్ మాబ్ ద్వారా విస్తృత ప్రచారం చేసినట్లు ప్రిన్సిపాల్ డాక్టర్ ఆస్ధాశర్మ తెలిపారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us