చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 9 డిసెంబర్ 2021: ఇటీవల రహదారి ప్రమాదంలో మరణించిన ఏటిపల్లి గ్రామానికి చెందిన ఆశా కార్యకర్త ముర్ల చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షురాలు మట్ల వాణిశ్రీ డిమాండ్ చేశారు. గంగవరంలో ఆశ కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడారు. గత నెల 23 తేదీన ఆశ కార్యకర్త ప్రమాదం గురై మరణించారని, ఆమె మరణానికి గంగవరం పీ.హెచ్.సీ వైద్యులు బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలకు గ్రూప్ ఇన్సూరెన్స్ ఏర్పాటు చేయాలని, మరణించిన వారికి రూ.10 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ చలో కలెక్టరేట్ లు ముట్టడి చేసే కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆశా కార్యకర్తలు తరలివచ్చినా, గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఆశా కార్యకర్తలు వైద్యులు బెదిరింపులకు గురి చేసి బలవంతంగా విధులు నిర్వహింపచేశారన్నారు. చిన్నారి కుటుంబానికి న్యాయం జరగకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు మంగయ్యమ్మ, మార్తమ్మ, చంద్రకళ తదితరులు హాజరయ్యారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us