విజయవాడ (రెడ్ బీ న్యూస్) 15 డిసెంబర్ 2021 : ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత దుర్గమ్మను రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ డి.వి.ఎస్. సోమయాజులు దంపతులు మంగళవారం దర్శించుకున్నారు. అధికారులు వారికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అమ్మవారి పంచహారతులు తిలకించిన అనంతరం న్యాయమూర్తి దంపతులకు దేవస్థానం అధికారులు అమ్మవారి దర్శనం చేయించారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేశారు. దేవస్థానం వైదిక కమిటీ సభ్యుడు శ్రీనివాసశాస్త్రి, సూపరింటెండెంట్ రమణరాజు వారికి అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు.
Related News
-
Kakinada Collector: కాకినాడ కలెక్టర్ పై 'బదిలీ' పిడుగు
-
Peddapuram Tahasildar : పెద్దాపురం తహశీల్దార్‌పై వేటుకు రంగం సిద్ధం!
-
వేట్లపాలెం బాణాసంచా విస్ఫోటనం: పెద్దాపురం ఆర్డీవో శ్రీరమణిపై సస్పెన్షన్ వేటు
-
I&PR : సీఎంవోకి చేరిన కాకినాడ జిల్లా మీడియా అక్రిడేషన్ల పంచాయతీ..
-
PACS KATTAMURU : ఘనంగా కట్టమూరు పీఏసీఎస్ చైర్ పర్సన్ ప్రమాణ స్వీకారం
-
తెలుగు సాహిత్యానికి 'రత్నాలబాల' డిజిటల్ తోరణం







