UPDATED 5th OCTOBER 2018 FRIDAY 5:00 PM
సామర్లకోట: మహిళా శిశు సంక్షేమానికి ప్రభుత్వం విశేష కృషి చేస్తున్నట్లు తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి పేర్కొన్నారు. మండల పరిధిలోని హుస్సేన్ పురం గ్రామంలో బాల సంజీవిని కార్యక్రమంలో భాగంగా రక్తహీనతతో ఉన్న గర్భవతులకు ఆయన చేతుల మీదుగా శుక్రవారం రాగి పిండి, ఖర్జూరం, బెల్లంతో పాటు పౌష్ఠికాహారాన్ని అందచేశారు. ఈ సందర్భంగా బుజ్జి మాట్లాడుతూ మహిళల ఆరోగ్యానికి ఎక్కువగా పౌష్టికాహారం తీసుకోవాలని, దీంతో పుట్టబోయే చిన్నారులు ఆరోగ్యంగా ఉంటారన్నారు. అలాగే క్రమం తప్పకుండా వైద్యుల సలహా తీసుకోవాలన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో ప్రత్యేక దృష్టి సారించినట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది ఎం. సూర్యకుమారి, అంగన్వాడీ కార్యకర్తలు ఎర్రా వెంకటలక్ష్మి, మారిశెట్టి దుర్గాభవాని, పంచాయతీ సిబ్బంది ఎం. నారాయణమూర్తి, తదితరులు పాల్గొన్నారు.







