ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల ప్రొఫెసరుకు జాతీయ అవార్డు

UPDATED 2nd NOVEMBER 2018 FRIDAY 5:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల కెమిస్ట్రీ ప్రొఫెసర్, రీసెర్చ్ అండ్ డవలప్ మెంట్ విభాగాధిపతి డాక్టర్ పి.వి.ఎస్. మాచిరాజుకు డాక్టర్ ఉమా సాయిప్రకాష్ కెమిస్ట్రీ పాపులరైజేషన్ అవార్డు-2018 లభించినట్లు కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు తెలిపారు. రసాయన శాస్త్ర ప్రాముఖ్యత, సమాజ సేవలో రసాయన శాస్త్ర పాత్ర ముఖ్యంగా గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు అవగాహన కల్పించే క్రమంలో డాక్టర్ మాచిరాజు చేసిన సేవలకు ఈ అవార్డు లభించిందన్నారు. రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ లో గల రీజినల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ మాజీ వైస్ ఛాన్సెలర్ ప్రొఫెసర్ ఎ.డి. సావంత్, జనరల్ సెక్రటరీ డాక్టర్ డి.వి. ప్రభు చేతుల మీదుగా ఈ అవార్డు అందుకున్నారని, ఈ అవార్డు క్రింద రూ. పది వేలు నగదు బహుమతి, ప్రశంసాపత్రం పొందారన్నారు. గతంలో డాక్టర్ మాచిరాజు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, ఢిల్లీ తెలుగు అకాడమీ అవార్డు, జిల్లా మెరిటోరియస్ టీచర్ అవార్డులు పొందారని తెలిపారు. ఈ అవార్డు లభించడం పట్ల కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు, డైరెక్టర్ హరనాధబాబు, వైస్ ప్రెసిడెంట్ సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభూప్రసాద్, వివిధ విభాగాల అధిపతులు, విద్యార్థులు, రీసెర్చ్ స్కాలర్లు తదితరులు ఆయనను అభినందించారు.              

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us