సీజనల్‌ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి

UPDATED 19th JULY 2019 THURSDAY 9:00 PM

సామర్లకోట: సీజనల్‌ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. గురురువారం ఉదయం స్థానిక అమ్మణమ్మ కాలనీ, పెన్షన్ లైన్ ప్రాంతాల్లో మున్సిపల్ కమీషనర్ పర్యటించారు. ఈ సందర్భంగా వార్డుల్లో గల ప్రజలతో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం వాతావరణంలో కలిగే మార్పుల వల్ల అంటువ్యాధులు ప్రబలి అనారోగ్యం వచ్చే అవకాశం ఉన్నందున ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని అన్నారు. మురుగు కాలువలు, మరుగుదొడ్లు, నీటి ట్యాంకులు, ఇండ్ల పరిసరాలలోని గుంతల్లో నీరు నిలువ లేకుండా చూసుకోవాలని, దోమలు, ఈగలు, తదితర క్రిమి, కీటకాలు, పందులు ఇంటి పరిసరాల్లో సంచరించకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈ సిహెచ్ రామారావు, శానిటరీ ఇనస్పెక్టర్ జె. రాజశేఖర్, హెల్త్ అసిస్టెంట్ పొడుగు చిట్టిబాబు, మున్సిపల్ సిబ్బంది శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us