UPDATED 4th SEPTEMBER 2019 WEDNESDAY 9:00 PM
సామర్లకోట (రెడ్ బీ న్యూస్): పట్టణ పేదరిక నిర్మూలనా సంస్థ (మెప్మా) ఆధ్వర్యంలో సామర్లకోట మున్సిపాలిటీ పరిధిలోని మూడవ వార్డులో గల పాఠశాలలో న్యూట్రీ షాప్ ను మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు బుధవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో పౌష్టికాహార లోపం లేకుండా తక్కువ ఖర్చుతో అధిక పోషకాలు లభించే ఆహారాన్ని ఈ షాప్ లో విక్రయించడం జరుగుతుందని అన్నారు. అనంతరం షాప్ లో విక్రయించే సున్నుండలు, మరమరాలు, రాగి ఉండలు, తదితర తినుబండారాలను కమీషనర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ డీఈ రామారావు, మెప్మా అధికారులు, సిబ్బంది మోహన్, సునీత, సుజాత, చంద్రశేఖర్, సంధ్యారాణి, సత్య, తదితరులు పాల్గొన్నారు.







