శాంతివర్ధన అనాధాశ్రమాన్ని పరిశీలించిన అర్డీవో

UPDATED 16th AUGUST 2018 THURSDAY 5:30 PM

పెద్దాపురం: జిల్లా కలెక్టర్ కార్తికేయమిశ్రా ఆదేశాల మేరకు మండల పరిధిలోని పులిమేరు గ్రామంలో గల శాంతివర్ధన వికలాంగుల అనాధాశ్రమాన్ని రెవెన్యూ డివిజనల్ అధికారి ఎన్.ఎస్.వి.బి. వసంత రాయుడు, తహసీల్దార్ గంగుమళ్ల బాలసుబ్రహ్మణ్యం, సిడిపివో ఆదుర్తి విజయలక్ష్మి, పులిమేరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ రాంబాబునాయిక్ తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అనాధాశ్రమం నిర్వహకుడు రాయవరపు వీరబాబును పిల్లల మంచి చెడ్డలు, వారికి అందచేస్తున్న భోజన వసతి సదుపాయాలు, పాఠశాల వాతావరణం, త్రాగునీరు, తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్బంగా ఆర్డీవో వసంతరాయుడు మాట్లాడుతూ జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు అనాధ ఆశ్రమాల పనితీరును పరిశీలిస్తున్నామని, పెద్దాపురం డివిజన్ పరిధిలో ప్రత్తిపాడు, తుని, పెద్దాపురం మండలాల్లో ఈ ఆశ్రమాలు ఉన్నాయని అన్నారు. పులిమేరులో నిర్వహిస్తున్న ఈ ఆశ్రమం నిర్వహణ పట్ల ఆర్డీవో సంతృప్తి వ్యక్తం చేశారు. సిడిపివో, వైద్యులను తరచూ ఈ ఆశ్రమాన్ని సందర్శించి పిల్లల ఆరోగ్య పరిస్థితిని పరిశీలించాలని, అలాగే వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ కృష్ణారావు, రెవిన్యూ ఇనస్పెక్టర్ తేజ, విఆర్వో కిరణ్, ఆశ్రమ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us