ఎయిడ్స్ నిర్మూలనకు సమష్టిగా కృషి చేయాలి

UPDATED 13th AUGUST 2019 TUESDAY 6:00 PM

పెద్దాపురం: ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతీ ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని వైజ్ సంస్థ ప్రాజెక్ట్ మేనేజర్ డి. రాజు అన్నారు. ఇంటర్నేషనల్ యూత్ డే సందర్భంగా స్థానిక మహారాణీ కళాశాల విద్యార్థినీ, విద్యార్థులకు ఎయిడ్స్ వ్యాధిపై అవగాహనా సదస్సు మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ వ్యాధి బారిన పడ్డ వారిపై వివక్ష చూపకుండా ఆదరించాలని, వారికి మానసిక స్థైర్యాన్ని అందించాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. ఈ సందర్భంగా హెచ్ఐవి మనదేశంలో ఎలా వ్యాపించింది, వ్యాధి బారిన పడిన రోగులు తీసుకోవలసిన జాగ్రత్తలు, తదితర అంశాలపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ సూపర్ వైజర్ ఏసుబాబు, వైజ్ సంస్థ సిబ్బంది వి. జార్జ్, కె. వీర్రాజు, సిహెచ్ సాయి, డి. సాయి, తదితరులు పాల్గొన్నారు.         

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us