సృష్టికి మూలం అమ్మ

UPDATED 13th FEBRUARY 2019 WEDNEDAY 9:00 PM

పెద్దాపురం: అమ్మ పట్ల గౌరవంతో, భక్తి భావంతో ఉండాలని, జీవితాంతం జాగ్రత్తగా చూసుకోవాలని ఎంఇవో జివిఆర్ దుర్గాప్రసాద్ అన్నారు. మండల పరిధిలో గల గ్రామాల్లో అమ్మకు వందనం  కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల పరిధిలోని ఆర్ బి.కొత్తూరు గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఎంఇవో దుర్గాప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ ప్రపంచంలో సృష్టికి నిదర్శనం తల్లి అని, అందుకే మనం మాతృదేవోభవ అంటున్నామని చెప్పారు. దేవుడిని పూజించడానికి ముందు ప్రతీ ఒక్కరూ తల్లిని పూజించాలని పేర్కొన్నారు. అమ్మ గొప్పతనాన్ని విద్యార్థులకు తెలియచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమ్మకు వందనం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని  అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు. విద్యార్థులు తమతమ తల్లుల పాదాలు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించి గెలుపొందిన విజేతలకు బహుమతులు అందచేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.            

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us