UPDATED 9th NOVEMBER 2018 FRIDAY 9:00 PM
సామర్లకోట: పట్టణంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నగరదర్శని-నగర వికాసం కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని పెద్దాపురం ఆర్డీవో ఎన్.ఎస్.వి.బి. వసంతరాయుడు అన్నారు. పట్టణ పరిధిలోని 21వ వార్డులో భీమవరపుపేటలో మున్సిపల్ అధికారులు శుక్రవారం పర్యటించారు. గత నాలున్నర సంవత్సరాలలో పట్టణంలో వార్డులో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలపై రాజమహేంద్రవరం భాషా సాంస్కృతిక శాఖ ఎస్. చలం జానపద కళాబృందంచే కళాజాతా ప్రదర్శన నిర్వహించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ సిహెచ్. వెంకటేశ్వరావు, రెవిన్యూ, మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







