జిల్లాస్థాయి క్రికెట్ పోటీలలో రన్నర్ గా ఆదిత్య టీమ్

UPDATED 10th JANUARY 2019 THURSDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన క్రికెట్ జట్టు ఈనాడు ఛాంపియన్ కప్-2018 ప్రాంతీయ క్రికెట్ ఫైనల్ పోటీల్లో కైట్ జట్టుతో హోరాహోరీగా తలపడి రన్నర్ గా నిలిచింది. రాజమండ్రి జిఎస్ఎల్ కళాశాల మైదానంలో జరిగిన ఈ పోటీల్లో రన్నర్ గా నిలిచిన జట్టు  సభ్యులకు ట్రోఫీతో పాటు రూ. 2500/-లు నగదు బహుమతి లభించింది. ఈ సందర్బంగా జట్టు సభ్యులను ఆదిత్య విద్యా సంస్థల వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ వల్లెం శ్రీనివాసరావు అభినందించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్ సి.హెచ్. మురళీమోహన్ తదితరులు పాల్గొన్నారు. 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us