UPDATED 25th DECEMBER 2020 FRIDAY 8:00 PM
పెద్దాపురం (రెడ్ బీ న్యూస్): భారతదేశ మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్‌పేయి జయంతి వేడుకలను పెద్దాపురం మండలం జి. రాగంపేట గ్రామంలో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షులు చిలుకూరి రాంకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర నాయకులు బిక్కిన విశ్వేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన గావించి వాజ్‌పేయి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు మాట్లాడుతూ వాజ్‌పేయి జనసంఘ్ మొదటి అధ్యక్షుడిగా పని చేశారని అన్నారు. భారతీయ జనతాపార్టీలో అంత్యోదయ కార్డులు తీసుకువచ్చి పేదల జీవితాల్లో వెలుగులు నింపారన్నారు. విద్యా వ్యవస్థల్లో విప్లవాత్మకమైన మార్పులతో పేద, మధ్య తరగతి వర్గాల్లో కూడా విద్య అందించాలనే లక్ష్యంతో సర్వశిక్ష అభియాన్‌ని ప్రవేశపెట్టారన్నారు. జాతీయ రహదారులు నిర్మించి రవాణారంగంలో దేశాభివృద్దికి మొట్టమొదట బాటలు వేశారని కొనియాడారు. ఉత్తమ పార్లమెంటేరియన్‌గా నిలిచారని, అలాగే స్వర్ణ చతుర్భుజిని ప్రారంభించారని తెలిపారు. భారతీయులు గుండెల్లో చెరగని ముద్రగా ఉన్నారని అందుకే ఈరోజు ఆయన జయంతిని గుడ్ గవర్నెన్స్ డే గా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం రూరల్ బీజేపీ అధ్యక్షులు విజ్జపురెడ్డి. వి.వి. సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి మోటూరి వీరబాబు,యువమోర్చా నాయకులు ఇళ్ల శివభాస్కర్, కార్యదర్శి శివ, ముత్యం వీరబాబు, అడపా నూకరాజు, గోపు తిరుపతిరావు, పి. మణికంఠ, నామన శ్రీరాములు, వి. కొండారావు, పి. మురళీకృష్ణ, ఆర్. మంగరాజు, తదితరులు పాల్గొన్నారు.







