UPDATED 27th MAY 2019 MONDAY 6:00 PM
పెద్దాపురం: నిరుద్యోగ యువతీ, యువకులకు ఉపాధి అవకాశాల కల్పనలో భాగంగా కౌశల్ గోదావరి, వికాస, దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 28వ తేదీన మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల చైర్మన్ బేతినీడి శ్రీనివాసరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ జాబ్ మేళాలో ఫాక్స్ కాన్ (ఆర్.ఎస్.ఎం.ఐ.పి.ఎల్) సంస్థలో మొబైల్ టెక్నీషియన్, ఇండిగో ఎయిర్ లైన్స్ లో లోడర్స్, డ్రైవర్స్, కియో మోటార్స్ లో టెక్నీషియన్, బిగ్ బాస్కెట్ సంస్థలో కస్టమర్ రిప్రజెంటేటివ్, టిసిఎస్ సంస్థలో బిజినెస్ ప్రోసెస్ సర్వీసెస్ వంటి ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలకు ఎంపికలు జరుగుతాయని అన్నారు. అభ్యర్ధులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లమో (మెకానికల్), ఐటిఐ (ఆల్ ట్రేడ్స్) ఉత్తీర్ణులై, 30 సంవత్సరాల లోపు వయస్సు ఉండాలని తెలిపారు. వీరికి జీతం నెలకు రూ.9 వేలు నుంచి రూ.16 వేలు వరకు ఉంటుందని అన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువతీ, యువకులు తమ బయోడేటా, సర్టిఫికెట్లు జిరాక్స్, ఆధార్ జిరాక్స్ కాపీలతో ఈ నెల 28వ తేదీన ఉదయం తొమ్మిది గంటలకు దివిలి కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరుగు ఈ జాబ్ మేళాకు హాజరు కావాలని ఆయన కోరారు. మరిన్ని వివరాలకు www.vikasajobs.com, 9182801037, 0884-2352763, 2352767 నెంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు.







