వ్యక్తిగత పరిశుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యం

UPDATED 15th OCTOBER 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్): వ్యక్తిగత పరిశుభ్రతతో విద్యార్థులు సంపూర్ణ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని సామర్లకోట మున్సిపల్ కమీషనర్ ఎం. ఏసుబాబు పేర్కొన్నారు. ప్రపంచ చేతులు పరిశుభ్రత దినోత్సవాన్ని సందర్భంగా స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం తోటకూర సాయిరామకృష్ణ, ఉపాధ్యాయులు విద్యార్థులతో చేతుల పరిశుభ్రత దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. సైన్స్ ఉపాధ్యాయులు విద్యార్థులకు చేతులు శుభ్రపరచడంలో వివిధ దశలను ప్రయోగాత్మకంగా వివరించారు. ఈ కార్యక్రమంలో పేరెంట్స్ కమిటీ చైర్మన్ నక్కా జానకి రామయ్య, వ్యాయామ ఉపాధ్యాయుడు తాళ్లూరి  వైకుంఠం, ఉపాధ్యాయులు షఫీ, రాజు, కె. అరుణ, కె.వి.వి.సత్యనారాయణ, శ్రీనివాసు, భద్రావతి, శ్రీలక్ష్మి, లక్ష్మీ దుర్గ, రాజేంద్ర కుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us