ఆదిత్యను సందర్శించిన వీరమాచినేని

UPDATED 17th MARCH 2018 SATURDAY 9:00 PM

గండేపల్లి: ప్రముఖ వ్యాపారవేత్త వీరమాచినేని రామకృష్ణ  స్థానిక సూరంపాలెం లోని ఆదిత్య క్యాంపస్ ను శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ సతీష్ రెడ్డి లను కలుసుకున్నారు. ప్రశాంత వాతావరణం, విశాలమైన భవంతులు, చక్కని పూలతో నిండివున్న ప్రాంగణం ఎంతో ముచ్చటగా ఉందని, ఇంత చక్కటి ప్రాంగణాన్ని నిర్వహిస్తున్న సతీష్ రెడ్డిని ఆయన అభినందించారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ డైట్ ద్వారా షుగర్, బి.పి తదితర వ్యాధులను దూరం చేసుకోవచ్చని, అనవసరంగా ఇంగ్లీష్ మందులు ఉపయోగించి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారని, అందుకే రాష్ట్రవ్యాప్తంగా స్వంత ఖర్చుతో ప్రజలందిరికీ అవగాహన కల్పించడానికి సదస్సులు నిర్వహిస్తున్నానని అన్నారు. ఎటువంటి దీర్ఘకాలిక మధుమేహ వ్యాధిగ్రస్తులైనా కేవలం ప్రకృతి నుంచి లభించే కల్తీ లేని డైట్ ద్వారా మంచి ఫలితాలు సాధించవచ్చని అన్నారు. దేశవ్యాప్తంగా ఎందరో యు ట్యూబ్ ద్వారా వీరమాచినేని వీడియోలు చూసి తమ ఆరోగ్యాలను మెరుగుపరుచుకుంటున్నారని అన్నారు. ఇటువంటి సమాజ సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్న ఆయననుఁ ప్రభుత్వం గుర్తించి అవార్డుతో సత్కరించాలని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ శేషారెడ్డి అన్నారు.      

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us