UPDATED 11th APRIL 2018 WEDNESDAY 7:00 PM
సామర్లకోట: దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీల ఆమరణ నిరాహారదీక్షకు మద్దత్తుగా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు బుధవారం స్థానిక రైల్వే స్టేషన్లో రైల్ రోకో నిర్వహించారు. చైన్నై నుండి కాకినాడ పోర్ట్ కు వెళ్తున్న సర్కార్ ఎక్స్ ప్రెస్ నిలిపివేసి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని నినాదాలు చేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కురసాల కన్నబాబు మాట్లాడుతూ ప్రత్యేక హోదా లేకపోతే రాష్ట్రానికి భవిష్యత్ లేదని, గత నాలుగేళ్లలో రూ.లక్షా 22 వేల కోట్లు అప్పు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం ఎంతో అభివృద్ధి పథంలో ఉందని ప్రజలను నమ్మించారని ఆరోపించారు. పెద్దాపురం నియోజకవర్గ కో- ఆర్డినేటర్ తోట సుబ్బారావు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చలేదని, తమ పార్టీ ఎంపీలు నిరాహార దీక్ష చేస్తున్నా ప్రధానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గ కో-ఆర్డినేటర్ ముత్యాల శ్రీనివాస్, పిఠాపురం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ పెండెం దొరబాబు, రంపచోడవరం నియోజకవర్గ కో-ఆర్డినేటర్ అనంతబాబు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆవాల లక్ష్మీనారాయణ, పట్టణ అధ్యక్షుడు మద్దాల శ్రీను, కార్యదర్శి సేపేని సురేష్, కౌన్సిలర్ కాళ్ళ లక్ష్మీనారాయణ, మాజీ ఎంపిపి మేడిశెట్టి భద్రం, పెద్దాపురం కౌన్సిలర్ వాసంశెట్టి గంగ, శెట్టిబత్తుల దుర్గ, అధిక సంఖ్యలో పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.







