UPDATED 29th NOVEMBER 2018 THURSDAY 5:30 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ ప్రాంగణములో ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మిరాకిల్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ (విశాఖపట్నం) సహకారంతో ఎపి క్లౌడ్ వర్క్ షాప్ గురువారం ప్రారంభమైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.కె. రామకృష్ణారావు తెలిపారు. మిరాకిల్ సాఫ్ట్ వేర్ సొల్యూషన్స్ నుంచి ఐదుగురు ప్రతినిధులు ఈ వర్క్ షాప్ కు హాజరై ఇంజనీరింగ్ విద్యార్థులకు ఇంటర్ నెట్ ఆఫ్ థింగ్స్ అనే అంశంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డాక్టర్ రామకృష్ణారావు దాని ప్రాధాన్యతలు వివరించారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవంలో ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ నల్లమిల్లి శేషారెడ్డి, వైస్ చైర్మన్ నల్లమిల్లి సతీష్ రెడ్డి, క్యాంపస్ డైరెక్టర్ డాక్టర్ మేడపాటి శ్రీనివాసరెడ్డి, వివిధ విభాగాల అధిపతులు హాజరై తమ తమ అభిప్రాయములతో పాటు అభినందనలు తెలియచేశారు.







