ఎయిర్ పోర్టును సందర్శించిన ఆదిత్య విద్యార్థులు

UPDATED 14th OCTOBER 2018 SUNDAY 8:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ ద్వితీయ సంవత్సరం మేనేజ్ మెంట్ అభ్యసిస్తున్న 79 మంది విద్యార్థినీ, విద్యార్థులు రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయాన్ని సందర్శించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు పుస్తక పరిజ్ఞానంతో సమానంగా విమానాశ్రయంలో జరిగే టేక్ ఆఫ్, లాండింగ్, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ పనితీరు తదితర కార్యకలాపాలను ప్రత్యక్షంగా పరిశీలించి జ్ఞానాన్ని పెంపొందించుకున్నారని తెలిపారు. ఈ విధంగా ఆర్జించిన జ్ఞానాన్ని విద్యార్థులు తమ నిజ జీవితంలో అన్వయించినపుడు వారికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని సుగుణారెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ డి. ఆస్థాశర్మ, అధ్యాపకులు, విద్యార్థినీ, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.          

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us