UPDATED 3rd JANUARY 2019 THURSDAY 9:00 PM
సామర్లకోట: ప్రముఖ సంఘ సంస్కర్త, తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీభాయిపూలే 188వ జయంతి వేడుకలు స్థానిక అయోధ్యరామపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాలలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తొలుత సావిత్రీభాయిపూలే చిత్రపటానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం సాయిరామకృష్ణ మాట్లాడుతూ బాలికా విద్యకు సావిత్రీభాయిపూలే నాంది పలికారని, గొప్ప మానవతావాది ఆమె పురస్కరించుకొని మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకోవడం ఆనందదాయకమన్నారు. తమ పాఠశాల ప్రగతి పథంలో పయనించడానికి మహిళా ఉపాధ్యాయుల అంకితభావం ప్రశంసనీయమని, అలాగే ప్రతీ విషయంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. అనంతరం మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మహిళా ఉపాధ్యాయులు కె. అరుణ, ఎ.ఎల్.వి. కుమారి, డివిఆర్ఎన్ వల్లి, పిడి తాళ్లూరి వైకుంఠం, జి. గోవిందు, కెవివి సత్యనారాయణ, శ్రీనివాసు, ఏపీ రాజేంద్రకుమార్, కోడూరి శివ మాస్టారు, తదితరులు పాల్గొన్నారు.







