ప్రగతిలో రోబోటిక్స్ పై అవగాహన సదస్సు ప్రారంభం

UPDATED 26th FEBRUARY 2019 TUESDAY 9:00 PM

గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ప్రగతి ఇంజనీరింగ్ కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు రోబోటిక్స్ అనే అంశంపై నిర్వహించనున్న అవగాహనా సదస్సు మంగళవారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి సాక్ రోబోటిక్స్ (భువనేశ్వర్)కు చెందిన అభిజిత్ చక్రవర్తి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కళాశాల చైర్మన్ డాక్టర్ పరుచూరి కృష్ణారావు మాట్లాడుతూ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు ఆధునిక పరిజ్ఞానంతో రోబోటిక్స్ లో నూతన ఆవిష్కరణలు చేసే విధానాలు గురించి ఈ సదస్సు ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెకానికల్ ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంట్రడక్షనల్ రోబోటిక్స్, రోబోట్ డిజైనింగ్, నీటిలో ప్రయాణించే రోబోట్లు, మన ఆదేశాలకు అనుగుణంగా వ్యవహరించే రోబోట్లను సొంతంగా తయారు చేసే విధానాలు, తదితర అంశాలపై అవగాహన కలుగజేయటం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు నూతన ఆవిష్కరణలను చేయడం ద్వారా తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి ఈ కార్యక్రమం ఎంతగానో  ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరక్టర్ మేనేజ్ మెంట్ ఎం.వి. హరనాధబాబు, డైరక్టర్ డాక్టర్ జి.రఘురాం, వైస్ ప్రెసిడెంట్ ఎం. సతీష్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. శంభుప్రసాద్, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

 

 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us