UPDATED 11th MARCH 2020 WEDNESDAY 8:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): ప్రసిద్ధ పంచారామ క్షేత్రం శ్రీ చాళుక్య కుమారారామ భీమేశ్వరస్వామిని ఏలూరు రేంజ్ డీఐజీ కె.వి. మోహనరావు బుధవారం దర్శించుకున్నారు. దేవస్థానం ఈవో పులి నారాయణమూర్తి ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం గణపతి పూజ నిర్వహించి స్వామి, అమ్మ వార్లకు ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు నంది మండపంలో ఆయనకు ఆశీర్వచనం అందజేశారు. ఆయన వెంట పెద్దాపురం డిఎస్పీ అరిటాకులు శ్రీనివాసరావు, పెద్దాపురం సీఐ విజయకుమార్, కాకినాడ సీఐ ఆకుల మురళీకృష్ణ, సామర్లకోట ఎస్ఐ సుమంత్, ట్రాఫిక్ ఎస్ఐ బాలాజీ, తదితరులు పాల్గొన్నారు.







