Pushpa: బెనిఫిట్‌ షో రద్దు.. బన్నీ ఫ్యాన్స్‌ ఆందోళన థియేటర్‌పై రాళ్లు రువ్విన ప్రేక్షకులు

హిందూపురం (రెడ్ బీ న్యూస్) 17 డిసెంబర్ 2021: పట్టణం: అల్లు అర్జున్‌ కథానాయకుడిగా నటించిన ‘పుష్ప’ బెనిఫిట్‌ షో వేయకపోవడాన్ని నిరసిస్తూ హిందూపురం పట్టణంలో ఆయన అభిమానులు ఆందోళనకు దిగారు. పట్టణంలోని ఎస్వీ థియేటర్‌ యాజమాన్యం శుక్రవారం తెల్లవారుజామున ‘పుష్ప’ బెనిఫిట్‌ షో వేస్తామని టికెట్లు విక్రయించింది. దాంతో ప్రేక్షకులు పెద్ద సంఖ్యలో థియేటర్‌ వద్దకు చేరుకొని టికెట్లు కొనుగోలు చేశారు. అయితే ఎంతసేపటికీ షో ప్రారంభం కాకపోవడంతో వాళ్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే షో ప్రారంభించాలంటూ థియేటర్‌లో నినాదాలు చేశారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాలేదని.. బెనిఫిట్‌ షో రద్దు చేస్తున్నామని థియేటర్‌ నిర్వాహకులు ప్రకటించడంతో ప్రేక్షకులు ఆందోళనకు దిగారు. థియేటర్‌పై రాళ్లు రువ్వారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని లాఠీఛార్జీ చేశారు. థియేటర్‌ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us