UPDATED 12th JULY 2018 THURSDAY 9:00 PM
గండేపల్లి: గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల ఇసిఇ విభాగం విద్యార్థులకు నేషనల్ ఇనుస్ట్రుమెంట్స్ ల్యాబ్ వ్యూ అనే అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విభాగం, విజయవాడ సౌజన్యంతో మూడు రోజుల పాటు నిర్వహించిన వర్క్ షాప్ విజయవంతంగా ముగిసినట్లు కళాశాల డైరెక్టర్, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ఈ వర్క్ షాపులో ఎపిఐటిఎ ప్రతినిథి పూజిత పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్స్ సర్క్యూట్ డిజైన్ అండ్ సిమ్యులేషన్ పై విద్యార్థులు అవగాహన పెంపొందించుకోవడానికి, స్వంతంగా లైవ్ ప్రాజెక్ట్స్ రూపొందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈకార్యక్రమంలో విభాగాధిపతులు ప్రొఫెసర్ జి. శ్రీదేవి, ప్రొఫెసర్ వి. సత్యనారాయణ, కోఆర్డినేటర్ ప్రొఫెసర్ టి. శ్రీనివాసరావు, అధ్యాపక సిబ్బంది, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.







