UPDATED 11th MARCH 2020 WEDNESDAY 9:00 PM
సామర్లకోట(రెడ్ బీ న్యూస్): జై భారత్ నేషనల్ పార్టీ భారత్ మాతా సేవా పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ గొరకపూడి చిన్నయ్యదొర బుధవారం ఉదయం తెలుగుదేశం పార్టీలో చేరారు. పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప పార్టీ కండువా వేసి పార్టీలోకి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో డాక్టర్ చిన్నయ్య దొర దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేస్తానని డాక్టర్ చిన్నయ్యదొర పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు అడబాల కుమారస్వామి, పార్టీ నాయకులు బడుగు శ్రీకాంత్, కంటే జగదీష్ మోహన్, మాజీ మున్సిపల్ చైర్మన్ యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.







