గైట్ లో ముగిసిన సైబర్ సెక్యూరిటీ వర్క్ షాప్

UPDATED 20th SEPTEMBER 2018 THURSDAY 6:00 PM

రాజానగరం: గోదావరి ఇనిస్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ( గైట్) అటానమస్ కళాశాల ట్రైనింగ్ అండ్ ప్లేస్ మెంట్, ఎంసిఎ విభాగాల సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అకాడమీ (ఎపిఐటిఎ)చే  మూడు రోజులు పాటు కళాశాలలో నిర్వహించిన క్యాంపస్ వర్క్ షాప్ బుధవారం ముగిసింది. ఈ సందర్భంగా గైట్ అటానమస్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టి.వి. ప్రసాద్ మాట్లాడుతూ ప్రస్తుత కంప్యూటర్ యుగంలో సమాచార భద్రతను ప్రతీ ఒక్కరూ తమ భాద్యతగా భావించాలన్నారు. సైబర్ సెక్యూరిటీ అనగా హార్డ్ వేర్, సాఫ్ట్ వేర్ రంగాల్లో సమాచారం చోరీ కాకుండా కాపాడే రక్షణ వ్యవస్థ అని అన్నారు. టిపివో కె. వల్లీమాధవి మాట్లాడుతూ ఎపిఐటిఎచే సైబర్ సెక్యూరిటీ సింప్లిఫైడ్ అనే అంశంపై నిర్వహించిన వర్క్ షాప్ కు 60 మంది విద్యార్థినీ, విద్యార్థులు హాజరయ్యారన్నారు. సైబర్ దాడులు గురించి అవగాహన పెంపొందించుకోవడం ద్వారా సైబర్ దాడులను అరికట్టేందుకు వీలవుతుందని కళాశాల కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ బి. సుజాత అన్నారు. ఈ కార్యక్రమంలో డీన్ డాక్టర్ ఎం. వరప్రసాదరావు, ఎంసీఏ విభాగాధిపతి తమిళ్ కోడి, హైదరాబాద్ ఇఎస్ఎఫ్ ల్యాబ్స్ రిసోర్స్ పర్సన్స్ పి. వెంకటరాజు, ఎం. హరికాంత్, తదితరులు పాల్గొన్నారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us