UPDATED 19th MARCH 2018 MONDAY 9:00 PM
సామర్లకోట: తమ సమస్యలు పరిష్కారం కోరుతూ రాజధానిలో బహిరంగ సభ నిర్వహించడానికి బయలుదేరిన అంగన్వాడీ సిబ్బందిని స్థానిక రైల్వే స్టేషన్ లో పోలీసులు అడ్డుకుని పోలీస్ స్టేషన్ కు తరలించిన సంగతి తెలిసిందే. తమను నిర్బందించినందుకు నిరసనగా స్థానిక పోలీస్ స్టేషన్ లో అంగన్వాడీ సిబ్బంది సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో ఎం. వీరలక్ష్మి, మంగయ్యమ్మ, ఎం రాజేశ్వరి, అంగన్వాడీ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.







