టాటా క్విజ్ లో ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ

UPDATED 15th MARCH 2018 THURSDAY 6:30 PM

గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ విద్యార్థులు ప్రతిష్టాత్మకమైన టాటా క్విజ్ లో ప్రథమస్థానం కైవసం చేసుకున్నట్లు ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా సుగుణారెడ్డి మాట్లాడుతూ ఇటీవల వైజాగ్, హైదరాబాద్ లో నిర్వహించిన టాటా క్విజ్ లో తమ కళాశాల తృతీయ సంవత్సరం బిబిఎ విద్యార్థులు శ్రేష్టా ఫోమ్రా, సంజయ్ చౌదరి ప్రథమస్థానం కైవసం చేసుకుని రూ.75 వేలు నగదు పురస్కారం, ప్రశంసాపత్రం గెలుపొంది, బెంగుళూరు, రాయపూర్, నాగపూర్, మణిపాల్, ఇండోర్ లలో జరుగు జోనల్ స్థాయి పోటీలకు అర్హత సాధించారని అన్నారు. అలాగే హైదరాబాద్ లో జరిగిన క్విజ్ పోటీలలో తృతీయ స్థానంలో నిలిచి అమెజాన్ కిండిల్స్, ఫాస్ట్ ట్రాక్ చేతి గడియారాలు, ప్రశంసాపత్రాలు గెలుపొందారన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి మాట్లాడుతూ విద్యార్థులను ఇటువంటి క్విజ్ ప్రోగ్రామ్స్ లో పాల్గొనేలా ప్రోత్సహిస్తూ వారికి తగు సూచనలు, సలహాలు అందిస్తామని, వివిధ కళాశాలల నుంచి వచ్చిన ఇతర విద్యార్థులతో తమ అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా మంచి సృజనాత్మక భావాలు అభివృద్ధి చెందుతాయన్నారు. విజేతలను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ నల్లమిల్లి శేషారెడ్డి, అధ్యాపకులు, తదితరులు అభినందించారు.   

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us