UPDATED 3rd OCTOBER 2017 TUESDAY 6:30 PM
గండేపల్లి: తూర్పుగోదావరి జిల్లా గండేపల్లి మండలం సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ బిజినెస్ స్కూల్ విద్యార్థులు ఏడు రోజుల పారిశ్రామిక శిక్షణలో భాగంగా పూనే, లోన్ వాలా, ఖండాలా తదితర ప్రాంతాలు పర్యటించారు. ఈ బృందంలో 70 మంది విద్యార్ధులు, నలుగురు అధ్యాపకులు పాల్గొన్నారు. విద్యార్ధులు వారి పర్యటనలో భాగంగా ప్రసిద్ధ యడియెంట్ ఇండస్ట్రీస్ ను సందర్శించి ఆటోమొబైల్ భాగాలు ఎలా పరీక్షిస్తారు, వాటి మన్నిక, విశ్వసనీయత తదితర పరీక్షా ప్రక్రియలను స్వయంగా పరిశీలించారు. అనంతరం మ్యాప్రో ఫుడ్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సందర్శించి స్నాక్స్, కాన్ఫెక్షనరీస్ తయారీ విధానాలు గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. ఈ పర్యటనలను విజయవంతంగా పూర్తిచేసిన విద్యార్థులను, అధ్యాపకులను కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎన్. సుగుణారెడ్డి, ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్. విశాలాక్షి, తదితరులు అభినందించారు.







