Seat Belts: నవంబర్ 1 నుంచి సీట్ బెల్టు తప్పనిసరి.. ఆదేశాలు జారీ చేసిన పోలీసులు

UPDATED 14th OCTOBER 2022 SATURDAY 06:10 PM

Seat Belts: వచ్చే నెల 1 నుంచి ముంబై పరిధిలో కారులో ప్రయాణించే ప్రయాణికులు, డ్రైవర్.. అందరూ తప్పనిసరిగా సీట్ బెల్టు ధరించాల్సిందే. దీనికి సంబంధించి ముంబై పోలీసులు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. దీని ప్రకారం.. ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే డ్రైవర్‌తోపాటు ప్రయాణికులు తప్పనిసరిగా సీట్ బెల్ట్ ధరించాల్సిందే.

మోటార్ వెహికిల్ (అమెండ్‌మెంట్) యాక్ట్ 2019, సెక్షన్ 194 (బి) ప్రకారం సీటు బెల్టు ధరించకుంటే చట్టప్రకారం నేరమే. వీరికి నిబంధనల ప్రకారం శిక్ష విధిస్తారు. సీట్ బెల్ట్ నిబంధన ఎప్పట్నుంచో ఉన్నప్పటికీ అది సరిగ్గా అమలు కావడం లేదు. ఈ అంశం ఇటీవల ప్రముఖ వ్యాపారవేత్త సైరస్ మిస్త్రీ మరణంతో మరోసారి తెరమీదికి వచ్చింది. ఆయన గత నెలలో ముంబై సమీపంలో కారు ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయలో ఆయన సీట్ బెల్ట్ ధరించలేదు. అందుకే ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీట్ బెల్ట్ నిబంధనను కఠినంగా అమలు చేయాలనే నిర్ణయానికి వచ్చింది మహారాష్ట్ర ప్రభుత్వం.

దీనిలో భాగంగా తాజాగా ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ముంబై రోడ్లపై ఫోర్ వీలర్స్‌లో ప్రయాణించే డ్రైవర్లు, వాహనదారులు సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే జరిమానాతోపాటు, శిక్ష తప్పదు. నవంబర్ 1 నుంచి అందరూ ఈ రూల్ ఫాలో కావాల్సిందే.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us