గ్యాస్ ఏజెన్సీని ఎస్టీలకు కేటాయించాలి

గంగవరం (రెడ్ బీ న్యూస్) 8  నవంబర్ 2021: మండలంలోని నెల్లిపూడిలో ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ ద్వారా ఎస్టీలకు కేటాయించిన ఇండియన్ గ్యాస్  డీలర్ షిప్ ను ఎస్టీ కులస్తులకు కేటాయించాలని నెల్లిపూడికి చెందిన బొంకు ప్రభాకర్ రావు, అన్నిక  శ్రీను తదితరులు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం సమర్పించారు. డీలర్ షిప్ ను ఎస్టీ కేటాయించగా దొంగ సర్టిఫికెట్ పొందిన ఎస్సీ కులస్తులకు కేటాయించారని, ఈ విషయమై గతంలో ఐవోసీ ఉన్నతాధికారులకు జిల్లా కలెక్టర్ ఐటీడీఏ పీవోకు ఫిర్యాదు చేసినప్పటికీ ప్రయోజనం లేదన్నారు. ఉన్నతాధికారులు స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us