UPDATED 27th APRIL 2019 SATURDAY 6:00 PM
ఏలూరు: అనాధ పిల్లలు, వృద్ధుల మధ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి, ఏఐసిసి సభ్యులు పెద్దిరెడ్డి ప్రదీప్ (దీపు) తన జన్మదిన వేడుకలను శనివారం అత్యంత నిరాడంబరంగా జరుపుకున్నారు. స్ధానిక మాదేపల్లిలో గల ప్రేమాలయం వృద్ధాశ్రమంలోని వృద్ధులకు అవసరమైన నెలవారి సరుకులు అందజేశారు. ప్రేమాలయంలో తాను నిర్మించిన "ప్రేమతో చిన్న ప్రయత్నం" అనే లఘు చిత్రాన్ని ఈ సందర్భంగా ప్రదర్శించారు. నేటి సమాజంలో తల్లిదండ్రులను వృద్ధాశ్రమంలో విడిచి పెడుతున్న నేటి యువతను ఆలోచింపజేసే విధంగా లఘు చిత్రం నిర్మించినట్లు తెలిపారు. అనంతరం వృద్ధుల ఆరోగ్య పరిస్థితిపై ఆయన అరా తీసి, ఆశ్రమంలో వారికి అందుతున్న సదుపాయాలు గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులను ఆప్యాయంగా పలికరిస్తూ వారితో ఎంతో ఆప్యాయంగా, సరదాగా గడిపారు. అనంతరం వారికి భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. నిశ్చింత వృద్ధాశ్రమం, సాయిధాం వృద్ధాశ్రమం, యువతరం ఫౌండేషన్ కు చెందిన అనాధశ్రమంలో కూడ భోజన సదుపాయాలు కల్పించారు. అనంతరం ప్రదీప్ మాట్లాడుతూ పిల్లల అలానాపాలనకు దూరమైన తల్లిదండ్రులు, తల్లిదండ్రులుకు దూరమైన అనాధ పిల్లల మధ్యలో పుట్టినరోజును జరుపుకోవటం తనకెంతో సంతృప్తిని ఇస్తుందని అన్నారు. పుట్టినరోజు వేడుకలను విలాసవంతమైన హోటళ్లు, స్నేహితులు మధ్య జరుపుకోవటం కన్నా ఇలాంటి ఆశ్రమాల్లో జరుపుకోవటం వల్ల వారికి నేనున్నాని భోరసా కల్పించటం తన ముఖ్య ఉద్దేశ్యం అన్నారు. గత 14 సంవత్సరాలుగా తన జన్మదిన వేడుకలను ఇటువంటి ఆశ్రమాల్లో జరుపుకుంటున్నానని, భవిష్యత్తులోను తన వంతు ఎలాంటి సాయం అయినా అందిస్తానని తెలిపారు. పెద్దిరెడ్డి ప్రదీప్ గతంలో లయన్స్ క్లబ్ ద్వారా, తన సేవా సంస్ధ అయిన హెల్పింగ్ హ్యాండ్స్ సొసైటీ ద్వారా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం, దుస్తులు పంపిణీ, విశాఖలో సంభవించిన హుద్ హుద్ తుఫాను బాధితులకు అండగా నిలబడి వారి సహాయార్ధం బియ్యం, నిత్యవసర వస్తువులు, భోజన సదుపాయాలు కల్పించారు. స్వైన్ ఫ్లూ సమయంలో వ్యాధి బారిన పడుకుండా మాస్క్ లు పంపిణీ, వేసవి కాలంలో మజ్జిగ పంపిణీ, ,పేద విద్యార్థులకు తన వంతు సహాయం అందించారు. భవిష్యత్తులో కూడ తన వంతుగా సమాజ సేవ చేస్తానని, తనకు ఉన్న దాంట్లో ఎదుటి వారికి సహాయపడతానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కొండ పవన్ సాయి, సిరాజ్, చింతయ్య, తదితరులు పాల్గొన్నారు.







