హుస్సేన్ పురంలో పింఛన్లు పంపిణీ

UPDATED 4th JULY 2018 WEDNESDAY 9:00 PM

సామర్లకోట: సామర్లకోట మండలం హుస్సేన్ పురం గ్రామంలో కొత్తగా మంజూరైన 18 పింఛన్లను స్థానిక పంచాయతీ కార్యాలయంలో బుధవారం తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు చల్లా బుజ్జి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టిడిపి అధికారంలోకి వచ్చాక గ్రామం చాలా అభివృద్ధి చెందిందని, అర్హులైన ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం పింఛన్లు అందచేయడం జరుగుతున్నట్లు తెలిపారు. అలాగే ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప సహకారంతో తమ గ్రామాన్ని మరింత అభివృద్ధి చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, లబ్ధిదారులు, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us