రాజ్యాంగ స్ఫూర్తి కలిగి ఉండాలి

UPDATED 26th NOVEMBER 2019 TUESDAY 9:00 PM

సామర్లకోట(రెడ్ బీ న్యూస్) : ప్రతీ ఒక్కరూ రాజ్యాంగ స్ఫూర్తిని కలిగి ఉండి, భారత రాజ్యాంగాన్ని గౌరవించాలని గ్రంథాలయాధికారి ఎం. శ్రీనివాసరావు అన్నారు. సామర్లకోట శాఖా గ్రంథాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం పాఠకులు, విద్యార్థినీ, విద్యార్థులచే రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం అనే అంశంపై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సిబ్బంది ఎస్. బుల్లియ్య, సీనియర్ పాఠకులు చుండ్రు రామయ్య చౌదరి, ఓలేటి శ్రీకృష్ణ శ్రీనివాస్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us