UPDATED 9th DECEMBER 2018 SUNDAY 9:00 PM
సామర్లకోట: స్థానిక అయోధ్యరామపురంలో గల బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యా విహారయాత్ర నిమిత్తం ఆదివారం మారేడుమిల్లి సందర్శించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు తోటకూర సాయిరామకృష్ణ తెలిపారు. రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ ఆర్ధిక సహకారంతో 68 మంది తొమ్మిదో తరగతి విద్యార్థులు, పాఠశాల పిడి తాళ్ళూరి వైకుంఠం, ఉపాధ్యాయులు కె.వి.వి. సత్యనారాయణ, జి. గోవిందు, ఏ.ఎల్.వి. కుమారి, సిహెచ్ భద్రావతి, డివిఆర్ఎన్ వల్లి, తదితర ఉపాధ్యాయులు హెచ్ఎం సాయిరామకృష్ణ ఆధ్వర్యంలో సాగిన విహార యాత్రలో ఆద్యంతం ఉల్లాసంగా గడిపారు. విద్యార్థులకు జలపాతాలు, అటవీ సంపదను పరిచయం చేసి, ప్రకృతిని, అడవులను సంరక్షించుకోవాల్సిన అవసరాన్ని విద్యార్థులకు అనుభవపూర్వకంగా తెలియపరిచారు. ఇటువంటి యాత్రల వల్ల విద్యార్థుల్లో సోదరభావం పరస్పర సహకారము దేశ సంపద పట్ల అవగాహన ఏర్పడతాయని హెచ్ఎం తెలిపారు. ఈ యాత్రకు ఆదిత్య విద్యాసంస్థల యాజమాన్యం బస్సు సౌకర్యం కల్పించారు.







