గైట్ లో హెలీప్యాడ్ ను పరిశీలించిన సబ్ కలెక్టర్

UPDATED 23rd JANAUARY 2020 THURSDAY 5:00 PM

రాజానగరం(రెడ్ బీ న్యూస్): రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పర్యటనను పురస్కరించుకుని స్థానిక గైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిపాడ్ ను రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ ఆర్. మహేష్ కుమార్ గురువారం పరిశీలించారు. ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయంలో ఈ నెల 24వ తేదీన జరగనున్న స్నాతకోత్సవంలో పాల్గొనేందుకు వస్తున్న గవర్నర్ తొలుత కళాశాలకు చేరుకొని, అనంతరం ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా గవర్నర్ బస నిమిత్తం సిద్ధం చేసిన చైతన్య విద్యా సంస్థల చైర్మన్ కె.వి.వి. సత్యనారాయణ రాజు (చైతన్య రాజు) ఛాంబర్, అతిథి గృహాన్ని సబ్ కలెక్టర్ పరిశీలించారు. గవర్నర్ పర్యటనకు సంబంధించి గైట్ కళాశాలలో చేస్తున్న ఏర్పాట్లును చైతన్య సంస్థల జనరల్ మేనేజర్ ఎ. నరేష్ రాజు, గైట్ జనరల్ మేనేజర్ డాక్టర్ పి. సుబ్బరాజు సబ్ కలెక్టర్ కు వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ కె. లతా మాధురి, డిఎస్పీలు ఏ.టి.వి. రవికుమార్, వెంకటరావు, వర్మ, ఆర్&బి ఎస్ఈ పి.డి. విజయకుమార్, ట్రాన్స్ కో ఈఈ తిలక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ కోమలి, జిల్లా ఆసుపత్రి సమన్వయకర్త డాక్టర్ రమేష్ కుమార్, తహసీల్దార్ జి. బాలసుబ్రహ్మణ్యం, సిఐ ఎం.వి. సుభాష్, పంచాయతీ రాజ్ డీఈ ఎ. రవి, తదితరులు పాల్గొన్నారు.             

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us