మండలవాణి సక్సెస్

UPDATED 29th MARCH 2018 THURSDAY 9:00 PM

ప్రత్తిపాడు: అర్జీదారులకు అందుబాటులో ఉండేలా పాలనను చేరువ చేస్తూ తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టరు ఎ. మల్లికార్జున స్థానిక మండల పరిషత్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మండలవాణి సక్సెస్ అయింది. ప్రజావాణికి  డుమ్మాకొట్టే అధికారులంతా తొలిసారిగా జాయింట్ కలెక్టర్ నిర్వహించిన ఈ కార్యక్రమానికి మండల స్థాయిలోని అన్నిశాఖల అధికారులు హాజరయ్యారు. పది శాఖలకు సంబంధించి 78 అర్జీలు జేసీకి అందాయి. ప్రతి దరఖాస్తును జాయింట్ కలెక్టర్ స్వయంగా పరిశీలించి 15 రోజుల్లోగా సమస్యను పరిష్కరించాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ సందర్భంగా జేసీ మల్లికార్జున మాట్లాడుతూ కలెక్టరు లేదా తనకు నేరుగా సమస్యలు చెప్పుకొనేందుకు కలెక్టరేట్‌కు వచ్చేందుకు ఎదురయ్యే ప్రయాసను తప్పించేందుకే వారానికి ఒక రోజు రెండు మండలాలకు వచ్చి సమస్యలు వింటామన్నారు. ఇప్పటికే నాలుగు చోట్ల నిర్వహించామని, జిల్లా అంతా ఈ కార్యక్రమం పూర్తయ్యేందుకు తొమ్మిది నెలలు పడుతుందన్నారు. ప్రజావాణిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, ప్రజల వద్దకే పాలన ఉండాలన్నదే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దాపురం ఆర్డీవో వి. విశ్వేశ్వరరావు, తహసీల్దార్ కె. నాగ మల్లేశ్వరరావు,  ఇంఛార్జ్ ఎంపీడీవో ఎం. అనుపమ, డివిజినల్ పంచాయతీ అధికారిణి ఎం. నాగలత, హోసింగ్ డిఇ పద్మావతి, పి.ఆర్.డి.ఇ. వెంకటేశ్వరావు, ఆర్.డబ్యు.ఎస్.డిఇ రవీంద్రబాబు, ఐ.కె.పి ఎపిఎం సుశీలా గ్రేస్, ఎ.ఎస్.వో పురుషోత్తం కుమార్, సిడిపివో గంగాభవాని, వ్యవసాయ శాఖ ఎడిఎ బి. చంద్రశేఖర్, పెద్దాపురం హోసింగ్ ఇఇ సుధాకర్ పట్నాయక్, డాక్టర్ ప్రశాంతి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.       

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us