లోక్‌అదాలత్‌లో ఇరుపక్షాలదీ విజయమే

UPDATED 8th SEPEMBER 2018 SATURDAY 8:00 PM

పెద్దాపురం: కేసుల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ సదస్సులు దోహదపడతాయని, రాజీమార్గమే రాచమార్గంగా లోక్‌అదాలత్‌లో కేసులు పరిష్కరిస్తున్నట్లు 7వ అదనపు జిల్లా జడ్జి ఎం..శ్రీనివాసాచారి తెలిపారు. స్థానిక కోర్టు కాంప్లెక్స్ ఆవరణలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్ సదస్సులో ఆయన మాట్లాడుతూ కక్షిదారులు పట్టుదలకు పోకుండా రాజీమార్గంలో లోక్ అదాలత్ ద్వారా కేసులు పరిష్కరించుకోవచ్చని, పేదలకు లోక్ అదాలత్ ద్వారా ఉచితంగా న్యాయ సహాయం పొందవచ్చని, వీటిని ప్రతీ ఒక్కరూ వినియోగించుకోవాలని తెలిపారు. సాధారణంగా కేసు గెలిచిన వాళ్లు సంతోషిస్తారని, ఓడిన వారు బాధపడతారన్నారు. లోక్‌ అదాలత్‌లో ఇరుపక్షాల అంగీకారంతో కేసులు పరిష్కరించడం వల్ల ఇరుపక్షాలూ విజయం సాధించినట్లేనని తెలిపారు. సత్వర న్యాయం అందించడంతోపాటు స్నేహపూర్వక వాతావరణంలో కేసులు పరిష్కరించడమే లక్ష్యంగా లోక్‌అదాలత్‌లు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇక్కడ అప్పీలు లేని న్యాయసంబంధమైన పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ రోజు జరిగిన లోక్ అదాలత్ లో కేసులు పరిష్కారానికి మూడు బెంచ్ లు ఏర్పాటు చేశారు. మొదటి బెంచ్ కి 7వ అదనపు జిల్లా జడ్జి ఎం..శ్రీనివాసాచారి, రెండవ బెంచ్ కి సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్, మూడవ బెంచ్ కి అడిషనల్ జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ సి.హెచ్. యుగంధర్ ప్రిసైడింగ్ ఆఫీసర్లుగా, న్యాయవాదులు ఎం.ఎస్.ఎన్. మూర్తి, ఎం. రాంబాబు, ఆర్.వి. విజయలక్ష్మి సభ్యులుగా వ్యవహరించారు. మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్, సీనియర్ సివిల్ జడ్జి కె. రత్నకుమార్, అదనపు జె.ఎఫ్.సి మేజిస్ట్రేట్ సి.హెచ్. యుగంధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వేదుల సుబ్రహ్మణ్యం, న్యాయవాదులు చట్టాలపై అవగాహన కల్పించారు. అనంతరం జరిగిన లోక్ అదాలత్ లో 15 క్రిమినల్ కేసులు, 47 ఎక్సైజ్ కేసులు, 2 చెక్ బౌన్స్ కేసులు, 10 ల్యాండ్ ఎక్విజిషన్, ఇతర సివిల్ కేసులు, ఒక మోటారు వెహికల్ కేసు రాజీ చేశారు. ఈ కేసుల్లో రాజీ మొత్తం ఎక్సైజ్ కేసులకుగాను రూ.14,600/-, చెక్ బౌన్స్ కేసులకు గాను రూ. 2,30,000/-, ల్యాండ్ ఎక్విజిషన్, ఇతర సివిల్ కేసులకు గాను రూ.33,74,021/-, మోటారు వెహికల్ కేసుకు గాను రూ.50,000/- నగదు పరిష్కరించారు. 

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us