విధి నిర్వహణలో అంకితభావమే ఉద్యోగికి గుర్తింపు

UPDATED 18th FEBRUARY 2019 MONDAY 9:00 PM

సామర్లకోట: అంకితభావంతో విధులు నిర్వహించిన ఉద్యోగులు అందరి మనసులో చిరస్థాయిగా నిలుస్తారని ప్రధానోపాధ్యాయుడు తోటకూర సాయిరామకృష్ణ అన్నారు. సామర్లకోట మున్సిపల్ కమీషనరుగా సుమారు 15 నెలలపాటు విధులు నిర్వహించి ఇటీవల బదిలీ అయిన చోడగం వెంకటేశ్వరరావును స్థానిక బచ్చు ఫౌండేషన్ మున్సిపల్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయ బృందం సోమవారం ఘనంగా సన్మానించి వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ఎం, జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత సాయిరామకృష్ణ మాట్లాడుతూ మున్సిపల్ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపుదలకు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి ఆయన ఎనలేని కృషి చేశారని కొనియాడారు. మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరావు మాట్లాడుతూ మున్సిపల్ కౌన్సిల్ సహకారంతో, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆదేశాలను అనుసరించి పట్టణ అభివృద్ధికి ఒక అధికారిగా అంకితభావంతో విధులు నిర్వహించానని, తనకు పూర్తి సహాయ, సహకారాలు అందించిన ఉపాధ్యాయులు, తదితరులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేస్తున్నానని అన్నారు. అనంతరం మున్సిపల్ కమీషనర్ వెంకటేశ్వరరావు, ఆయన సతీమణి లక్ష్మీదేవి దంపతులను దుశ్శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కెవివి సత్యనారాయణ, కె. శ్రీనివాస్, ఏ.ఎల్.వి. కుమారి, కె. అరుణ, పిడి తాళ్లూరి వైకుంఠం, ఏ.పి. రాజేంద్రకుమార్, తదితరులు పాల్గొన్నారు.

ads
×
  • Home
  • About Us
  • Politics
  • Crime
  • Devotional
  • Education
  • Entertainment
  • General
  • Business
  • Information
  • Gallery
  • Contact Us